English | Telugu

కొత్త కెప్టెన్ గా రేవంత్!

ముప్పై మూడవ రోజు మరింత ఆసక్తితో మొదలైన బిగ్ బాస్ రోజుకో కొత్త టాస్క్ లతో అలరిస్తోంది‌. అయితే ఈ రోజు హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం పోటీ రెండు లెవల్స్ లో కొనసాగింది. కాగా ఆదిత్య, సూర్య, రేవంత్ మొదటి లెవల్ లో గెలిచారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో రెండవ లెవల్ నియమాలు చెప్పాడు బిగ్ బాస్. "ఏ కంటెస్టెంట్ కెప్టెన్ అవ్వాలనుకుంటారో వారి మెడలో బంతిపూల మాల వేయాలి. ఎక్కువ బంతిపూల మాలలు ఎవరికి వస్తాయో, వారే ఈ వారం కెప్టెన్ అవుతారు" అని బిగ్ బాస్ వివరించాడు. కాగా ఈ టాస్క్ చాలా క్లిష్టంగా కొనసాగింది. అయితే చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ టాస్క్ లో రేవంత్ గెలిచి, హౌస్ లో కొత్త కెప్టెన్ గా ఎన్నికయ్యాడు.

రెండవ టాస్క్ ' హైయర్ తగ్గాఫర్'. ఇది ఎవరు బలమైన వాళ్ళో తేల్చే గేమ్. అయితే ఇందులో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఆదిత్యకి, గీతుకి మధ్యలో గట్టిగా గొడవ జరిగింది. "నువ్వు డీగ్రేడ్ చేస్తున్నావ్, ప్రతీసారీ చూస్తున్నా, గొంతు లేపితే కాదు, దేనికైనా లిమిట్ ఉంటుంది" అని గీతుతో గొడవకు దిగాడు ఆదిత్య. గీతు మాత్రం నేను నిన్ను అలా అనలేదు అని సమాధానం చెప్పినా, ఆదిత్య కన్ఫిన్స్ కాలేకపోయాడు. తర్వాత ఆదిరెడ్డి జోక్యం చేసుకొని ఇద్దరిని కాంప్రమైజ్ చేసాడు.

హౌస్ లో ఎన్నికైన కొత్త కెప్టెన్ రేవంత్ కి కంటెస్టెంట్స్ అందరు చప్పట్లతో శుభాకాంక్షలు తెలిపారు. అయితే శుక్రవారం కెప్టెన్ ని ఎన్నుకొని, తర్వాత శుక్రవారం వరకు ఆ కెప్టెన్ కొనసాగుతాడు అనే
విషయం, ఈ షో చూసే అభిమనులకు తెలిసిన విషయమే. అయితే హౌస్ లో అగ్రెసివ్, హైపర్ ఆక్టివ్ అని పిలువబడే రేవంత్ కెప్టెన్ గా వచ్చే శుక్రవారం వరకు ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తాడో చూడాలి మరి!

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.